రాయచోటి : జగనన్న విద్యా కానుక విద్యార్థుల బంగారు భవితకు బాట వేస్తుందని, చదువే పేదవాడి తలరాత మారుస్తుందని కలెక్టర్ గిరీష పి.ఎస్ తెలిపారు. సోమవారం రాయచోటి లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా విద్యా , సమగ్ర శిక్ష శాఖల ఆధ్వర్యంలో 'జిల్లాలో ఒకటి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక -4' కింద ఉచితంగా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యారంగంలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చిందని, నాలుగేళ్లల్లో రూ.60 వేల కోట్లను విద్యారంగానికి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బడులు తెరిచిన తొలి రోజు నుండే ఉచిత విద్యా కానుక కిట్ల పంపిణీ చేయడం మనందరికీ గర్వకారణమన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి జిల్లాలో 1709 ప్రాథమిక పాఠశాలలు, 214 ప్రాథమికోన్నత పాఠశాలలు, 296 ఉన్నత పాఠశాలల్లోఅన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 75,435 మంది బాలికలు, 79,354 మంది బాలురకు విద్యా కానుక కిట్లను అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రతి విద్యార్థికీ ఉచి తంగా బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, వర్క్ బుక్కులు, మూడు జతల యూనిఫాం (క్లాత్ కుట్టుకూలీతో సహా), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6-10 తరగతి పిల్లలకు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, 1-5 తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన విద్యా కానుక కిట్‌ను తల్లిదండ్రులపై భారం లేకుండా ప్రభుత్వమే ఉచితంగా అంది స్తోందని పేర్కొన్నారు. ఈ కిట్లను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకో వాల న్నారు. ప్రతి తల్లికి అమ్మ ఒడి కింద రూ.15 వేలు, జగనన్న విద్యాదీవెన కింద పెద్ద పెద్ద చదువులకు ఎంత ఖర్చైనా ఫీజు రియంబర్స్‌మెంట్, జగనన్న గోరు ముద్ద పథకాలను ప్రభుత్వం పటిష్టవంతంగా అమలు చేస్తోందన్నారు. గ 20, 30 సంవత్సరాలుగా పాడైపోయిన ప్రభుత్వ పాఠశాలలను దేశంలో ఎక్కడా లేని విధంగా నాడు నేడు కార్యక్రమంతో కార్పొరేట్‌కు ధీటుగా ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దారని చెప్పారు. ప్రతి పాఠశాలలో 10 రకాల మౌలిక వసతులను సమ కూర్చారని తెలిపారు. పిల్లలందరూ ఏ రంగంలో అయినా ఇష్టపడి చదవాలని పదవ తరగతితోనే ఆగిపోకుండా ఇంటర్, డిగ్రీ, పీజీ, సాంకేతిక విద్యలు అభ్యసిం చాలన్నారు. ప్రపంచీకరణతో ఎన్నో రంగాలలో అవకాశాలు ఏర్పడ్డాయి. వాటిలో నిపుణుల కొరత ఉంది. బాగా చదువుకున్న వారికి నేడు అనేక అవకా శాలతో పాటు ఉద్యోగాలు వస్తాయన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివిం చాలని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష మాట్లాడుతూ కులాలు, మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగనన్న పారదర్శకంగా పాలన చేస్తున్నారు. విద్యారంగం, వైద్య రంగంలో సంస్కరణలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతు న్నారు. డిఇఒ ఎస్.పురుషోత్తం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. పేదరికం ఏ విద్యార్థికి అడ్డు కారాదని అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుకలను ప్రభుత్వం ఇస్తోందన్నారు. నాడు నేడు ద్వారా ప్రతి విద్యార్థి మంచి వాతావరణంలో చదువుకునేలా ప్రతి పాఠశాలలో వసతులు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ విద్యార్థులకు ఉచితంగా జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా కో-ఆర్డినేటర్ దివాకర్, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, కౌన్సిలర్ నరసింహారెడ్డి, ఎంఇఒ బాలాజీ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సైదాబాను, పాఠశాల కమిటీ చైర్మన్ స్వర్ణలత, విద్యార్థినిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వి










