Dec 12,2022 22:11

చదరంగం పోటీలను ప్రారంభిస్తున్న ముఖ్య అతిథులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : చదరంగం ఆటతో మేథాశక్తి మెరుగుపడుతుందని రూరల్‌ సిఐ మన్సూరుద్దీన్‌ అన్నారు. స్థానిక కళాజ్యోతిలో సోమవారం నిర్వహించిన అండర్‌-14, అండర్‌-17 చెస్‌ క్రీడాకారుల ఎంపికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్‌ సిఐ మన్సూరుద్దీన్‌, కళాజ్యోతి ప్రెసిడెంట్‌ నారాయణప్ప, కార్యదర్శి శింగనమల రామకృష్ణ, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి అంజన్న, పట్టణ ప్రముఖులు శిరీష, పీఈటీ శివకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. చెస్‌ మేథాశక్తికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. చదరంగంలో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులు చెస్‌ ఆడి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెస్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.