Jan 02,2023 19:55

విద్యా సామగ్రి పంపిణీ చేస్తున్న సిఐ, ఎస్‌ఐ

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు పట్టణంలోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని పిల్లలకు నూతన సంవత్సర కానుకగా విద్యా సామగ్రిని వితరణ చేశారు. సోమవారం టూ టౌన్‌ సిఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ చంద్రమోహన్‌ చేతుల మీదుగా చిన్నారులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమి పట్టించుకోకుండా కేవలం చదువుపై మాత్రమే దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మానసికంగా దృఢంగా స్థిరంగా కేవలం విద్యపైన దృష్టి సారించాలని భవిష్యత్తులో మన సమాజానికి మంచి పౌరులుగా మీరు సేవలు అందివ్వాలన్నారు. ఎంపీ ఆనందన్‌ మాట్లాడుతూ స్థిరమైన నిధులు లేకపోయినా దాతల సహాయ, సహకారాలతో ముందుకు నడుపుతున్నామని తెలిపారు. పోలీస్‌ శాఖ నుంచి ఈ పుస్తక వితరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో విఎస్‌ ఆర్‌ గ్రూప్స్‌ అధినేత సుధాకర్‌ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ రామ్మూర్తి, సంస్థ పాలనాధికారి డాక్టర్‌ జి.సుబ్రహ్మణ్యం బాబు, సంస్థ జనరల్‌ సెక్రెటరీ ఎ.కవితా రాణి, ముత్తు ఆంగ్ల మాద్యం పాఠశాల ఉపాధ్యాయుల బృందం సుభాషిని, పుష్పవతి, రెడ్డి లక్ష్మి, పల్లవి, సురేంద్ర పాల్గొన్నారు. పోలీస్‌ సిబ్బందితో కలిసి వివేకానంద ఆశయం ఫౌండేషన్‌ భాను ప్రకాష్‌ బృందం పాల్గొన్నారు.