ఫొటో : చైర్ పర్సన్‌ను అభినందిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
చైర్‌పర్సన్‌కు ఎంఎల్‌ఎ అభినందనలు
ప్రజాశక్తి-అల్లూరు : స్థానిక పడమర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో శనివారం నూతన త్రిశభ్య కమిటీ చైర్‌పర్సన్ బత్తల భక్తవత్సల రెడ్డిని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీలలో రైతులకు విస్తృత సేవలు అందించాలని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు విరివిగా అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, ఎఎంసి వైస్‌చైర్మన్ ఊటు శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు నీలం సాయికుమార్ తదితరులున్నారు.










