ఫొటో : ఆశ్రమాన్ని పరిశీలిస్తున్న డిఇఒ గంగాభవాని
చైల్డ్ ఆశ్రమంలో డిఇఒ పరిశీలన
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలోని నార్త్ ఆములూరు పంచాయతీ పరిధి గొల్లపాలెంలోని చైల్డ్ ఆశ్రమాన్ని మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారిణి గంగా భవాని ఎంఇఒ నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలిసారిగా ఇక్కడకు వచ్చినట్లు, విద్యార్థులకు వసతులు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. ఆశ్రమానికి 10 నెలల నుండి యుఆర్‌ఎస్ బిల్లులు రాకపోవడంతో ఆరా తీశామని, సంబంధిత విషయంపై ప్రభుత్వానికి నివేదిక పంపి త్వరగా బిల్లులు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. ఆమెతోపాటు ఆశ్రమ నిర్వాహకులు రామచంద్ర శరత్, తదితరులున్నారు.










