Dec 28,2022 20:28

జెండాలు ఆవిష్కరిస్తున్న ఐద్వా నాయకులు

జెండాలు ఆవిష్కరిస్తున్న ఐద్వా నాయకులు
చాందస భావజాలంతో మహిళలు అణచివేత
ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి
నెల్లూరు:దేశంలో కులమతాల చాందస భావజాలాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఈ భావాలే మహిళల అణిచివేతకు ప్రధాన కారణమవుతున్నాయని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి అన్నారు. బుధవారం నెల్లూరు నగరంలోని డాక్టర్‌ రామచంద్రారెడ్డి భవన్‌ ఆవరణలో 13వ ఐద్వా అఖిల భారత మహాసభల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 13 జెండాలను ఆవిష్కరణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం అఖిల భారత 13వ మహాసభలు తివేండ్రం 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించుకుంటున్న మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ అన్ని ప్రాంతాల్లో స్థానిక శాఖల ఆధ్వర్యంలో 13 ఐద్వా జెండాలను ఆవిష్కరించాలని మహిళా సంఘం పిలుపు నిచ్చిందన్నారు. దేశంలో ఉన్నటువంటి కోటి మంది సభ్యులకు ప్రతినిధులుగా వెయ్యి మంది ఈ మహాసభలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో మహిళలు ప్రధానంగా ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతలకు గురవుతున్నారన్నారు
. అంతే కాకుండా అధికారంలోని ప్రభుత్వమే సాంప్రదాయ భావజాలాన్ని విస్తరింప జేస్తున్నందు వల్ల సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ఆ క్రమంలో ఇటీవల కాలంలో శ్రద్ధావాకర్‌ యరిపోయిన తరువాత మహారాష్ట్రలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏవరైనా మాతాంతర వివాహాలు చేసుకున్నారా అని, వారికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు వారిని విడగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. పర్యావరణ అంశాలను సైతం ఈ మహాసభల్లో చర్చకు రానున్నాయన్నారు. రాబోయే కాలంలో కలిసి వచ్చేటటువంటి వ్యక్తులను, ఏవరైతే మహిళల అభివృద్ది కోసం పనిచేస్తారో అటువంటి పురుషులను కలుపుకొని ఉద్యమాలను ఉదృతం చేసేందుకు ఈ మహాసభల్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.శివకుమారి, ఎస్‌కె మస్తాన్‌భీ, నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.వి.సుబ్బమ్మ, కె.పద్మ, రూరల్‌ అధ్యక్షురాలు ఎస్‌.వరలక్ష్మి, ఐద్వా సంఘం సీనియర్‌ నాయకురాలు ఎ.రమమ్మ పలువురు ఐద్వా సంఘం సభ్యులు పాల్గొన్నారు.