Apr 01,2023 14:53

 హైదరాబాద్ : మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో బంగారు పతకం నిఖత్ జరీన్ తొలిసారిగా హైదరాబాద్ కు చేరుకున్నారు.  శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న జరీన్ తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో నృత్యాలు చేస్తూ జరీన్ కి స్వాగతం పలుకుతూ కళాకారులు సందడి చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌లో రెండోసారి బంగారు పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన గెలుపునకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించడం పట్ల దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.  ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తన కెరీర్‌లో ఇది రెండో బంగారు పతకం. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దిశగా తమ కృషి కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం తెలిపారు.