Oct 02,2023 14:07
  • అక్రమ కేసులతో ఉద్యమాన్ని అనిచివేయలేరు
  • భూమంటే బడాబాబుల జాగీరు కాదు...

ప్రజాశక్తి-చిలమత్తూరు : భూమంతా బాడాబాబుల జాగీరు కాదు.. పేదల ప్రజలు, కష్టజీవుల హక్కు, రియాల్టర్ లకు బడాబాబులకు ,పెట్టుబడిదారులకు దారదత్తం చేసేందుకు ప్రభుత్వ స్థలాలను అప్పగించడం కోసం తహతహలు ఆడటం భూ స్వాదీన పోరాటం చేస్తున్న నాయకులపై అక్రమ కేసులు బనాయించాడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాణి అన్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరులో ప్రారంభించిన భూ స్వాదీన పోరాటం పెట్టుబడిదారులపై అంత ప్రేమ ఉంటే పట్టాభూములను కొనుక్కోనివ్వండి, లేదా మీ స్వంత భూమి ఉంటే అప్పగించండి అంతే గాని ప్రభుత్వ ఆస్తులుగా పేదల హక్కుగా ఉన్న అసెండ్ భూములను, పోరంబోకు భూములను అప్పగిస్తుంటే ఊరుకునేది లేదని ఆమె అన్నారు. కూడు గూడు గుడ్డ ప్రజల అందరి ప్రాథమిక హక్కు వాటిని సమకూర్చవల్సిన బాద్యత ప్రభుత్వం చేయల్సిన మొదటి పని కాని అలాంటివి విస్మరిస్తే పతనం తప్పదని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటి వద్దకు వచ్చి ఓట్లు అడిగిన బూర్జ్వా రాజకీయ పార్టీలు ఆ పార్టీ నాయకులు, మనతో ఓట్లు వేయించుకొని గెలిచిన ప్రజా ప్రతినిధులు మన గుడిసెల దగ్గరకు, మన పోరాట కేంద్రం వద్దకు వచ్చి మీ కష్టం ఏంటి అని అడిగారా? అడగరు, అలాంటి నాయకులకు బుద్ది చెప్పల్సిన అవశ్యకత ఉందని అర్థం చేసుకోవాలన్నారు. పోరాడి సాదించుకుందాం,పోరటాలతోనే ఏదైన సాధ్యం అని కూడా అనేక సందర్బలలో స్పష్టం అయిందని ఆమే అన్నారు. ఊర్లు కట్టిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మొదట ఇంటి స్థలాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని అన్నారు.‌గత పది రోజులుగా పేదలు గుడిసెలు వేసుకొని పోరాడుతున్న స్థానిక రెవెన్యూ అదికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అని అన్నారు. విలువైన భూమి కనుక దీనిని పెద్దలకు ముట్టజెప్పేందుకు పేదలను మాయజేసేందుకు, ప్రజలకు ద్రోహం చేసేందుకు ప్రయత్నించడం దారుణం అని అన్నారు.ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన పేదలను మోసం చేసే పద్దతులు అవలంభించడం దారుణం అన్నారు. అక్రమ కేసులు పెట్టిన రెవెన్యూ అదికారులును స్పష్టంగా అడుగుతున్నాం... వంక పోరం బోకులు, పేదలకు ఇచ్చిన అసెండ్ భూములు, ఇరిగేషన్ కాలువలు నదులు, వంకలు చెరువు సుమారు 300 ఎకరాలు ఆక్రమించుకున్న బడా భూస్వామికేమే ఎర్రతివాచి పరుస్తున్నారని మండిపడ్డారు. ఇంటి నిర్మాణం కోసం సెంటిన్నర భూమి ఇవ్వమని పేదోడు అడుగుతుంటే మాత్రం అక్రమంగా కేసులు పెడుతున్నారు. మీరు ఎవరికోసం పని చేస్తున్నారో ఈ రోజు ప్రజలకు సమాదానం చెప్పాలి అని అన్నారు. ఈ విశయంపై కలెక్టర్ కు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇంటి స్థలాలు ఇచ్చే వరుకు ఉధ్యమం కొనసాగుతుందని మరింత ఉదృతం అవుతుందని అందుకు అదికారులు తీరే కారణం అవుతుందని అన్నారు. మహాత్మ గాంది జయంతి సందర్బంగా గాంది చిత్రపటానికి పూలమాలలు వేసి భూ స్వాదీన పోరాట కేంద్రం వద్ద సత్యాగ్రహదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, కార్యదర్శి పెద్దన్న, జిల్లా కమిటీ సభ్యులు గంగధర్, వెంకటరమణ, నారాయణ, ఇంటి స్థలాల సాదన కమిటి సభ్యులు సదాశివరెడ్డి, చందు, చంద్ర, చరణ్, ఆనంద్, రమేష్, రహంతుల్లా, శివ, మణిస్వామి, రియాజ్, ఆటో కలీం తదితరులు పాల్గొన్నారు.