మాట్లాడుతున్న ఎంఎల్‌సి అభ్యర్థి మీగద వెంకటేశ్వర్ల రెడ్డి
భయభ్రాంతులకు గురి చేస్తున్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
ప్రజాశక్తి-నెల్లూరు:విధి నిర్వహణలో భాగంగా పాఠశాలల సందర్శించిన సమయంలో సలహాలు, సూచనలు అందజేయాల్సింది పోయి ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనలకు గురిచేయడం దారుణమని తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. తాను భాధ్యత వహిస్తున్న శాఖ ఎందుకు పనికి రాదని, బైజూసు ద్వారా పాఠాలు తానే చెప్తానని.. అది చాలు అని ప్రగల్భాలు పలకడం శోచనీయమన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం బైజుస్ కు అప్పజెప్పి ప్రభుత్వం తప్పుకునే యోచనలో ఉన్నట్లు అధికారుల చర్యలున్నాయన్నారు. ప్రజల్లో ఉపాధ్యాయులను చులకన చేసి మాట్లాడి తానే గొప్ప అనుకోవడం అనే ఈ ధోరణి మంచిది కాదని హితవు పలికారు. తన చేతిలోని ఉపాధ్యాయులు బదిలీలు, ప్రమోషన్ల ,విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించడం చేతకాక ఆయన చేతకాని తనాన్ని ఉపాధ్యాయుల మీదకు నెట్టి అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో 50,000 కు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి.3,4,5 తరగతులను హైస్కూల్ లో కలిపి వారికి తగినన్ని గదులు లేక,ఉపాధ్యాయులను సరిగా ఇవ్వక వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు . నాడు నేడు లో పనులు నత్తనడకన సాగుతున్నాయి.అనేక చోట్ల రూములు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పిల్లలు ఉన్నచోట ఉపాధ్యాయులను భర్తీ చెయ్యకుండా,సబ్జెక్ట్ టీచర్ పోస్టులు భర్తీ చెయ్యకుండా సర్దుబాటు అనే కొత్త విధానం అమల్లోకి తెచ్చి ఉపాధ్యాయుల శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రచార కార్యక్రమం మానుకొక పోతే ఉపాద్యాయ వర్గం నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవలసి వస్తోందన్నారు. ఉన్నత స్థాయి అధికారి తన స్థాయి మరిచి మాట్లాడిన మాటలు, ఉపాద్యాయులను కించపరుస్తూ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. విద్యాశాఖ గౌరవాన్ని పెంచి మీ గౌరవాన్ని పెంచుకోవాలని హితవు పలికారు.










