రాజంపేట అర్బన్ : రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా టిడిపినేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు తెలిపారు. శనివారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, యువగళం నిధి కింద 20 లక్షల ఉద్యోగాలు, అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం వంటి హామీలతో వైసిపిలో వణుకు పట్టిందని పేర్కొన్నారు. రానున్నది టిడిపి ప్రభుత్వమేనని, ప్రజలకు అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కల్లె రెడ్డప్ప, కొల్లు వెంకటరమణ నాయుడు, కొల్లు రవి నాయుడు, భానుగోపాల్ రాజు, రాయా వెంకటేష్, గుదే నాగార్జున నాయుడు, దామోదర్ నాయుడు, కార్య నిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, సిద్ధవటం మోహన్ రెడ్డి, మిరియాల జ్యోతి, అనసూయమ్మ, ఎర్రంరెడ్డి, కొటికే చలపతి నాయుడు, కోటికి అశోక్ నాయుడు, నిమ్మకాయల సిద్ధమనాయుడు, దుగ్గనపల్లి వెంకటరామిరెడ్డి, చాన్ బాషా బెల్లాల రమణ, సుబ్బరామయ్య, జయరాం నాయక్, ఎల్వి రమణ, ప్రసాద్ రాజు, భాస్కర్ రాజు వెంకటయ్య పాల్గొన్నారు.










