ప్రజాశక్తి-విజయవాడ: జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం పనులు జిల్లాలో వేగవంతంగా జరుగుతున్నాయని ఇప్పటికే భూ సర్వే పూర్తి చేయడంలో భాగంగా జిల్లాలో 7 గ్రామాల్లో 13 నోటిఫికేషన్ పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిపై సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, కార్యదర్శి బాబు ఏ, సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమీషనర్ సిద్ధార్థ జైన్‌లు ప్రధాన కార్యాలయం నుండి గురువారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జిల్లాలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిని వివరించారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట, కంచికచర్ల మండలం పరిటాల, గంపలగూడెం మండలం రాజవరం, చెన్నవరం, ఎ కొండూరు మండలంలోని వామకుంట్ల, మారేపల్లి, విస్సన్నపేట మండలం చంద్రుపట్ల గ్రామాలలో పూర్తి అయిందన్నారు. 16 గ్రామాలలో ఓఆర్‌ఐలు వచ్చాయన్నారు. దానిలో 7 పూర్తి చేశామన్నారు. మిగిలినవి 8 ఉన్నాయన్నారు. అందులో 5 గ్రౌండ్ వ్యాలిడేషన్, 3 గ్రౌండ్ ట్రూతింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. 26 గ్రామలలో డ్రోన్ ప్లె˜ౖ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ సిసిఎల్‌కు వివరించారు. ఈ సమావేవంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజరు కుమారి, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్ కె.సూర్యారావు పాల్గొన్నారు.
'హర్‌ఘర్ తిరంగా'ను ఘనంగా నిర్వహించాలి
హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ఎగురవేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహణపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13, 14, 15 తేదీలలో హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు, యువకులు, క్రీడాకారులతో ర్యాలీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ పతాక విశిష్టత దేశభక్తి తదితర అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 2వ తేదిన జాతీయ జెండా రూపకర్త పింగళివెంకయ్య జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్లకు
భూ కేటాయింపులలో ప్రథమ స్థానం
జిల్లాలో బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్(బియంసియు)లకు నిర్మాణాలకు అవసరమైన భూముల కేటాయింపు పూర్తిస్థాయిలో చేయడం జరిగిందని, ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్(ఎయంసియు) నిర్మాణాలకు అవసరమైన భూముల కేటాయింపును వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, ఏపి డైరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ పెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపి అమూల్ ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ బాబు.ఎకు వివరించారు. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 112 బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్(బియంసియు)కు పూర్తిస్థాయిలో భూములు కేటాయింపు జరిగి జిల్లా ప్రధమ స్థానంలో ఉన్నామన్నారు. 272 గ్రామాలలో ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్(ఎయంసియు) కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించే ప్రక్రియలో 161 పూర్తి అయ్యాయన్నారు.










