ఫొటో : తహశీల్దారుతో మాట్లాడుతున్న ఎపి వ్య.కా.సం. జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య
భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలి
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలో 67వ నెంబరు జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం బహిరంగ మార్కెట్ విలువపై నాలుగు రెట్లు కలిపి నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాలని ఆయన తహశీల్దార్‌ను కోరారు. భూనిర్వాసితులకు సంబంధించి పలు విషయాలను తహశీల్దార్‌కు వివరించారు. ఆయనవెంట నిర్వాసిత రైతులు సాధిక్ భాషా, ఎస్.కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.










