Dec 01,2022 21:16

సచివాలయ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు, బాధితులు

             ప్రజాశక్తి-పెనుకొండ   మండలంలోని బండపల్లి ఎస్సీ కాలనీలో భూకబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సచివాలయం కార్యదర్శి సాయికి సిపిఎం నాయకులు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, సిపిఎం మండల కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ బండపల్లి పాత ఎస్సీ కాలనీలో 40 దళిత కుటుంబాలు పూర్వకాలం నుంచి అనుభవిస్తున్న ప్రభుత్వ భూమిని శంకరప్ప, నారాయణరెడ్డి, అంజనప్ప అనే వారు ఆక్రమించుకున్నారన్నారు. కావున అనుభవిస్తున్న వారికే ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ నాయకులు వెంకటేష్‌, గంగాధర్‌, ఎస్సీ కాలనీవాసులు అంజనప్ప, నరేష్‌ అంజనమ్మ, హనుమక్క, తదితరులు పాల్గొన్నారు.