మాట్లాడుతున్న కమిషనర్
భూగర్భ డ్రెయిన్ పనులు వేగవంతం
- కమిషనర్ హరిత
నెల్లూరు:నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా జరుగుతున్న హడ్కో మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైను అభివద్ధి పనులను వేగవంతం చేయాలని కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. కార్యాలయంలో పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మంచినీటి సరఫరా పనులు, భూగర్భ డ్రైను పనులను అన్ని డివిజనుల్లో వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అభివద్ధి పనుల నిమిత్తం తీసిన గోతులను త్వరితగతిన పూడ్చి వేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కమిషనర్ కోరారు. నిర్దేశించిన సమయానికి అన్ని అభివద్ధి పనులనూ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య శాఖ ఎస్.ఈ గోపాల్ రెడ్డి, ఈ.ఈ మదర్సా అలీ, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ సంజరు ఇతర అధికారులు పాల్గొన్నారు.










