ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న పి సి అల్లూరు రాజు
భూ సమస్య పరిష్కారానికి వినతి
ప్రజాశక్తి-సీతారామపురం : సీతారామపురం, గుండుపల్లి పంచాయతీలలోనీ పలు రైతులకు సంబంధించి భూ సమస్యలను పరిష్కరించాలని తహశీల్దార్ ఎం.శ్యామ్ సుందర్ రాజాకు రాష్ట్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పిసి. అల్లూరు రాజు వినతి పత్రాన్ని అందజేశారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఆయనవెంట గుండుపల్లి పంచాయతీ వైసిపి నాయకుడు మాచిరాజు వెంకటేశ్వర్లు ఉన్నారు.










