Feb 02,2023 21:04

- సమావేశంలో మాట్లాడుతున్న రమేష్‌రెడ్డి

రాయచోటి : భూ పంపిణీ కార్యక్రమం పేరుతో వైసిపి నాయకులు అక్రమాలు అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసిపిలో కొంత మంది నాయకులు కొత్త రేషన్‌ కార్డులు సాగుతో తండ్రికి భూమి ఉన్న కూడా కొడుకుకు భూమి లేదని స్వాగతం భూ పంపిణీ కార్యక్రమంలో కొత్త రేషన్‌ కార్డులు ఏర్పాటు చేసుకొని భూ పంపిణీ కార్యక్రమం పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామాలలో నిజమైన నిరుపేదలు ఉంటే వారి వారికి భూ పంపిణీ చేస్తున్న వారి లిస్టు సచివాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలో వందల ఎకరాలు కబ్జాలు చేసేదానికి వైసిపి నాయకులు పంతం పట్టుకొని పనిచేస్తున్నారు. రెవెన్యూ అధికారులు అర్హులైన నిరుపేదలకు భూపబలి కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు అక్రమాలు జరగకుండా హుందాగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని రాబోయేది తమ ప్రభుత్వం మే అని అప్పుడు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అనంతరం విలేకరులు 2024లో ఎమ్మెల్యే టికెట్‌ ఎవరికి వస్తుందని అడగగా ఇప్పటివరకు తన నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్నానని తన పోటీలో ఉంటానని ధీమా చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాజులు ఖాదర్‌ బాషా, మాజీ జడ్‌పిటిసి నర్సారెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షుల మురికి నాటి వెంకటసుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్‌లు భాషా, బసవయ్య పాల్గొన్నారు.