వ్య.కా.స, కెవిపిఎస్ నాయకుల డిమాండ్
ప్రజాశక్తి-ఓబులవారిపల్లె: మండలంలో జరుగుతున్న భూ కబ్జాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎం.జయరామయ్య, పందికాళ్ళ మణి, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ ఓబిలి పెంచలయ్య అన్నారు. సోమవారం అధ్వర్యంలో తశీల్దారు కార్వాలయం మండల పరిధిలోని వైకోట, బాలిరెడ్దిపల్లె గ్రామాల నిరుపేద ప్రజలు, ఎస్‌సి, ఎస్‌టిలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద దళిత, గిరిజనులకు భూములు పంచాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పేదలకు దక్కాల్సిన భూములను కొందరు కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారన్నారు. పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ విడత భూపంపిణీలో పేదలకు భూములు పంచాలని డిమాండ్ చేశారు. అక్రమ భూములు కబ్జా చేసిన వారికి చేసిన ఆన్‌లైన్, నకిలీ పాస్‌పుస్తకాలను రద్దు చేయాలని కోరారు. వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వందల ఎకరాల భూమలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నా అనంతరం తహశీల్దార్ మున్నీర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కెవిపిఎస్ మండలం కార్యదర్శి నాగిపోగు పెంచలయ్య, రైతు సంఘం నాయకులు చెంగయ్య, హరి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొజ్జా శివయ్య, కేశవులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










