ఫొటో : భోజన ప్యాకెట్లు అందజేస్తున్న దృశ్యం
భోజన ప్యాకెట్లు వితరణ
ప్రజాశక్తి-కావలి : సంయుక్త సేవాసంస్థ అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో నెల్లూరు పట్టణం నివాసులు కె.శ్రీనివాసరావు, కె.కనకరావు తల్లి కె.సోమరాజు 23వ వర్థంతి సందర్భంగా మంగళవారం శివరామసుబ్బయ్య కాలనీలో నివసిస్తున్న నిరుపేద గిరిజనులకు చీరలు వితరణ చేయడంతోపాటు బిరియానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.కామేశ్వరి, రాజేష్‌కుమార్ కుమారుడు ఎస్.నిశ్వాంత్ రామ్ పుట్టినరోజు సందర్భంగా కావలి పట్టణం కాలేరుగుంట సమీపంలో ఉన్న గిరిజనులకు భోజన ప్యాకెట్లు వితరణ చేశారు. ఈ సందర్భంగా సంయుక్త సేవాసంస్థ అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.










