Jan 13,2023 22:22

ఫొటో : భోగిమంటల్లో జిఒ కాపీలను దహనం చేస్తున్న టిడిపి నేత మాలేపాటి సుబ్బానాయుడు

భోగి మంటల్లో జిఒ నెంబర్‌ ఒకటి
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పార్టీ శ్రేణులతో కలసి, కావలి పార్టీ కార్యాలయం బయట భోగిపండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఇటీవల ప్రభుత్వం మొండి వైఖరితో అమలుపరిచిన చీకటి జిఒ నెంబర్‌ 1 కాపీలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు.
''సైకో పోవాలి... సైకిల్‌ రావాలి''అనే నినాదాలతో కార్యాలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా పత్రికా విలేకరులతో సుబ్బానాయుడు మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలన సైకో పాలనగా ఉందని, నలుగురు కలిసి స్వేచ్ఛగా తిరిగెందుకు వీలు లేకుండానే ఇటువంటి జిఒలను అమలుపరుస్తున్నారని, మొన్నటి రోజున చలో కావలికి దళితులు పిలుపునిస్తే కావలి పట్టణంలోఎన్నడూ చూడని విధంగా వేలాదిగా పోలీసులను దింపే అవసరం ఉందా? అని ప్రశ్నించారు. దళితులపై మారణ హోమాన్ని సృష్టిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయన్నారు.