ప్రజాశక్తి - యంత్రాంగం: రాష్ట్రంలో సభలు, ర్యాలీలు, రోడ్‌షోలను నిషేధిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జిఒ-1ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లాలో భోగి మంటల్లో చీకటి జిఒ ప్రతులు దగ్ధం చేశారు. తెల్లవారుజామునే టిడిపి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చిన భోగి మంటల్లో ప్రతుల కాపీలను దగ్ధం చేశారు.
రాయచోటి : ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 1 ప్రతులను టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో వేసిన బోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం టిడిపి రాయచోటి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు ప్రతులను దగ్ధం చేశామన్నారు. వైసిపి నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజావేదిక కూల్చడంతో జగన్మోహన్ రెడ్డి విద్వాంశక పరిపాలన ప్రారంభమైందన్నారు పిచ్చి తుగ్లక్ విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. అభివద్ధి సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగాయన్నారు. కేవలం మాయమాటలతో పత్రిక ప్రకటనలతో జగన్మోహన్ రెడ్డి మాయాల పకీరుగా మోసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సంబేపల్లి మండల అధ్యక్షుడు రెడ్డయ్య యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు తాహిర్, రమణ, చందు, శ్రీనాథ్, వెంకటరమణ పాల్గొన్నారు. నందలూరు: ఆంధ్ర రాష్ట్రంలో సైకో పాలన పోవాలని సైకిల్ పాలన రావాలని మండల క్లస్టర్ ఇన్‌ఛార్జి పసుపులేటి ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం భోగి పండుగ పురస్కరించుకొని జిఒ ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమాలు చేసే హక్కు మనకుందన్నారు. కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : పిడిఎస్‌యు ఆధ్వర్యంలో మండలంలోని దప్పేపల్లెలో జిఒ ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న, జిల్లా నాయకులు స్వరూప్ తేజ, అనిల్, చంద్రశేఖర్, అక్షరు, అరుణ్ పాల్గొన్నారు. రైల్వేకోడూరు : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న చీకటి జీవో నెంబర్ -1ని వెంటనే రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. జిఒ కాపీలను, సైకో దిష్టిబొమ్మను భోగి మంటల్లో కాల్చి సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో ప్లకార్డులను పట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో కోడూరు మండల పార్టీ అధ్యక్షులు కొమ్మ శివ, మాజీ ఉపసర్పంచ్ నార్జాల హేమరాజ్ మాజీ జడ్‌టిసి నాయుడోరి రమణ, రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు పులెల రమేష్, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు హస్తి సుప్రజ, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి కటికం సునీత, యువ నాయకులు పోతురాజు నవీన్, పోకల మని, రాజంపేట పార్లమెంట్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు తేనెపల్లి చిన్న, హస్తి చంద్రరాజు, మైనారిటీ నాయకులు కరీముల్లా, వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి బుంగటావల రాజశేఖర్, చంద్రమౌళి, మండలం ఐటిడిపి ఛాంపియన్ ఒలిమికుమార్ రామయ్య, కైలాసాని శీను పాల్గొన్నారు.










