Jul 14,2021 10:52

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెంలో జోరువానలు కురుస్తున్నాయి. ములకలపల్లి మండలం, పూసుగూడెం గ్రామ శివారులో ఉన్న సీతారామ ప్రాజెక్ట్‌ కాలువ వంతెన వద్ద రోడ్డు కుంగిపోయింది. దీంతో భారీ వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక, మండల అధికారులు హెచ్చరించారు. ప్రజలు వాగులు దాటకుండా పర్యవేక్షణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశించారు. మరోవైపు... చర్లతాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 16 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 11,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.