బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
ప్రజాశక్తి-ఉదయగిరి : సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు బయోమెట్రిక్ హాజరు శాతం తప్పనిసరిగా ఉండాలని ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని తిరుమలాపురం సచివాలయంను ఎంపిడిఒ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలామంది వాలంటీర్స్ బయోమెట్రిక్ హాజరు వేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిమం 50శాతం హాజరు వేయాలని సిబ్బందికి గ్రామ వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వాలంటరీలు ఆయుష్మాన్ భారత్ సర్వే లో వెనుకబడి వున్నారు. అందరూ వాలంటీరీలు ఎఎన్‌ఎం, ఆశల సహకారంతో 100 శాతం ఆయుషమాన్ భారత్ సర్వేను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. అలసత్వం వహించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకటరమణ, డయానా శ్రీ సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.










