హైదరాబాద్ : బ్యాంకుల నుండి రూ.200 కోట్లు లోన్లు తీసుకొని టోకరా వేసిన నిందితుడిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన సంబంధ్ ఫిన్‌సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సిఇఒ, ఎండి దీపక్ కిండోను మైక్రో ఫైనాన్స్ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకొని మోసాలకు పాల్పడ్డాడు. నాబార్డ్‌కు దీపక్ రూ.5 కోట్లు కుచ్చుటోపి పెట్టాడు. దీపక్ కిండోపై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. నాబార్డ్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.










