Apr 29,2023 21:30

ఫొటో : మాట్లాడుతున్న మేనేజర్‌ సిహెచ్‌ శ్రీనివాసరావు

బ్యాంక్‌ రుణాలపై అవగాహన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆత్మకూరు బ్రాంచ్‌ పరిధిలోని మేనేజర్‌ సిహెచ్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం మండలంలోని నువ్వురుపాడు గ్రామంలోని సచివాలయంలో పిఎంజెజెబివై, పిఎంఎస్‌బివై ఇన్సూరెన్స్‌ పథకాల గురించి గ్రామ సభ్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్యాంకు అందిస్తున్న రుణాల గురించి డిపాజిట్లు సాధారణ సభ్యులకు 7.50శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 8శాతం, సూపర్‌ సీనియర్‌ సిటిజన్‌కు 8.50శాతం వడ్డీ ఇస్తున్నామని తెలిపారు.
ఇతర బ్యాంకుల కన్నా డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు ఇస్తున్నామన్నారు. తమ బ్యాంకులో హౌస్‌ మార్టికేజీ లోన్లు వ్యాపారానికి ఎస్‌ఎంఇ లోన్స్‌ బంగారు ఆభరణాలపై 7.90శాతం రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనాలకు కారు రుణాలు స్వయం సహాయ సంఘాలకు రుణ అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్‌ సిహెచ్‌ శ్రీనివాసరావు, సూపర్‌వైజర్‌ జనార్దన్‌ రెడ్డి, వెంకటేశ్వర్లు సొసైటీ సిఇఒ పద్మనాభ రెడ్డి, డిఆర్‌డిఎ విఒఎ పాల్గొన్నారు.