Aug 06,2022 22:45

ప్రజాశక్తి కంచికచర్ల
కంచికచర్ల జంగాల కాలనీలో భూమికి అద్దె చెల్లించి గుడారాలు వేసుకని జీవనం సాగిస్తున్న బుడిగి జంగాల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావుకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఎమ్మెల్యే స్వయంగా కలెక్టర్‌ ఢిల్లీరావు ను వెంటబెట్టుకొని జంగాల కాలనీలో గుడారాల్లో నివాసం ఉంటున్న బుడిగి జంగాల కుటుంబాలను కలిశారు. అలాగే విజయవాడలో నడుస్థున్న కంచికచర్ల సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల కంచికచర్లలో తాత్కాలిక భవనాల్లో నడపటం కోసం స్తానికంగా ఖాళీగా ఉండి శిధిలావస్థకు చేరిన ఎస్టీ మహిళా హాస్టల్‌ భవనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. తహశీల్దార్‌ వి రాజకుమారి, యంపిడిఓ కె శిల్పా, అర్‌ఐ శిరీష, కార్యదర్శి కనగాల రవికుమార్‌, హౌసింగ్‌ ఏఈ ఆకుల నరశింహారావు, గ్రామ పంచాయతీ సర్పంచ్‌ వేల్పుల సునీత పాల్గొన్నారు.