Jan 13,2023 21:57

మహిళకు చీర పంపిణీ చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి కదిరి టౌన్‌ :సంక్రాంతి పండుగ సందర్భంగా తలుపుల మండలం ఓబుల రెడ్డి పల్లిలో వైసిపి సంయుక్త కార్యదర్శి బత్తల హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సిఇసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, బత్తల వెంకటరమణ ముఖ్య అతిథులుగా పాల్గొని వెయ్యిమంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు అంతేకాకుండా ఓబులరెడ్డి పల్లి మసీద్‌ నిర్మాణం కోసం డాక్టర్‌ బత్తల హరి ప్రసాద్‌ రూ. 1.50 లక్షలు విరాళంగా అందజేశారు. కదిరి పట్టణ అధ్యక్షులు బాహుద్దీన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఇసి సభ్యులు పూల శ్రీనివాస్‌ రెడ్డి,నాయకులు డాక్టర్‌ బత్తల వెంకట రమణ,కుమ్మర వాండ్ల పల్లి మాజీ సర్పంచి బత్తల వెంకట రమణ మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి తమ కుటుంంబం రాజకీయాల్లో కొనసాగుతోందని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి బిసి నాయకులు సంపంగి గోవర్ధన్‌, మండల కన్వీనర్‌ శంకర్‌, యూత్‌ అధ్యక్షుడు ఉత్తా రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి, సర్పంచులు మనోహర్‌ నాయుడు, మల్లి నాయుడు, పట్నం షామీర్‌ బాషా, బత్తల యూత్‌ నాయకులు అఖిల్‌, ముబారక్‌, కిరణ్‌, కార్తీక్‌, షాజహాన్‌, బాబ్జాన్‌, సూరినేని కిరణ్‌, మెహబూబ్‌ బాషా, బత్తల శ్రావణ్‌, వాల్మీకి అంజి, సాబ్‌ జాన్‌, నరసింహతో పాటు ప్రజలు పాల్గొన్నారు.