బట్టేపాడులో నూతన గోడౌన్ ప్రారంభం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : వ్యవసాయంలో రైతులందరికీ లాభాలు చేకూరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టి సారించారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ గోడౌన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి జిల్లా కోపరేటివ్ బ్యాంక్ రీజనల్ మేనేజర్, చల్లా శంకర్ బాబు, బట్టేపాడు సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి, ఆత్మకూరు సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ నాగులపాటి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్లు డాక్టర్ శ్రావణ్ కుమార్, షేక్ సర్దార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐ.వి.రమణారెడ్డి ఇతర వైసిపి నేతలు కార్యకర్తలు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో అందేందుకు గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి గోడౌన్‌లు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ముఖ్యమంత్రి 175 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన అంశంపై విక్రమ్‌రెడ్డి, అలాగే నవరత్నాల మేనిఫెస్టోతో ప్రభుత్వం పరీక్ష రాసిందని అందుకు 175 మార్కులు రావడం ఖాయం అంటూ ముఖ్యమంత్రి ప్రస్తావించిన 175 సీట్లను విద్యార్థుల మార్కులతో పోల్చి చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ఏదో రూపాన వివాదాస్పదం చేస్తూ కోర్టులకు వెళుతూ ప్రభుత్వ పనులకు అడ్డం పడుతూ కాలయాపన చేయడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందని విమర్శించారు. సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయని గడపగడపకు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి సమస్య ప్రభుత్వానికి తెలుస్తున్నాయని ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు నోటి వినరు కుమార్ రెడ్డి, పెమ్మసాని శ్రీనివాసులు నాయుడు, చిల్లూరు వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.










