May 08,2023 21:48

ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

బ్రిజేష్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలి
- ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఆవాజ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రెజ్లర్లపై లైంగిక దాడి చేసిన భారతదేశ రెజ్లింగ్‌ అధ్యక్షుడు బ్రిజేష్‌ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేసి, పదవి నుండి తొలగించాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఆవాజ్‌ల ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయం నుండి ర్యాలీగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు గుల్జారు బేగం మాట్లాడుతూ ఎంతోమంది మహిళలపై లైంగిక దాడి జరుగుతుందని, వాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. అయినా మోడీ మనసు ఏమాత్రం కరగలేదని ఐద్వా నాయకురాలు గుల్జర్‌ బేగంఅన్నారు. బిజెపి మతతత్వాన్ని రెచ్చ కొట్టడమే కాకుండా మహిళలకు నీచంగా చూస్తున్నారని తెలిపారు.
ఆవాజ్‌ జిల్లా నాయకులు యస్థాని మాట్లాడుతూ బ్రిజేష్‌ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలని రెజ్లింగ్‌ క్రీడాకారులకు రక్షణ కల్పించాలని కోరారు. జనవరి నుండి వేసిన కమిటీని ఇంతవరకు పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ఆ విషయాన్ని మోడీ ప్రజలకి చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. దేశ ప్రధానికి ఎన్నికలే ప్రధానంగా ఉన్నాయని దేశంలో మహిళల రక్షణ ముఖ్యం కాదన్నారు. ఆయన మాట్లాడితే దేశంలో 80శాతం హిందువులు ఉన్నామని హిందువులకు రక్షణ కల్పిస్తామని చెప్పడం కానీ సాక్షి మాలిక్‌ హిందువు కాదా ఆమెకు రక్షణ కల్పించలేరా అని ప్రశ్నించారు. రక్షణ కల్పించలేని హిందూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ లేదంటే వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు. వేరే వాళ్లు వచ్చి హిందువులకు రక్షణ కల్పిస్తారన్నారు. భారతదేశంలో జీవిస్తున్న అన్ని కులమతాలకు అతీతంగా రక్షణ కల్పిస్తారన్నారు. కులాలు మతాలు రెచ్చగొట్టి ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయొద్దన్నారు. డివైఎఫ్‌ఐ నాయకులు నంద శీను మాట్లాడుతూ దేశంలో తలమానికగా ఉన్న క్రీడాకారులను దేశ ప్రతిష్టను తెచ్చే క్రీడాకారులపై లైంగిక దాడులు చేయడం చాలా బాధాకరమన్నారు. దేశాన్ని పరిపాలించే బిజెపి ప్రభుత్వం బేటి బచావో అనే నినాదం అంటూ మహిళా క్రీడాకారులపై లైంగిక దాడులు చేయడం శోచనీయమన్నారు. వెంటనే నిందితులను అరెస్టు చేసి క్రీడాకారులకు న్యాయం చేయాలని వాళ్లు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్‌ రాజు, నాయకులు షేక్‌ సంధాని, ఆళ్ల హజరత్తయ్య, ఐద్వా నాయకురాలు కొండ లక్ష్మమ్మ, మహబూబ్‌ బాషా, గద్దర్‌ బాబు, రమణయ్య తదితరులు ఉన్నారు.