Apr 10,2023 22:19

ఫొటో : నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి : సిపిఎం
ప్రజాశక్తి-కోవూరు : కోవూరు చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పాటూరు, గుమ్మళ్లదిబ్బ, బుచ్చి, కొడవలూరు గ్రామాల ప్రజల దశాబ్ధాల కలను నెరవేర్చాలని గండవరపు శేషయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలుజుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కరపత్రాలు పంచి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం మొదలైతే కోవూరు చెరువుకలుజు ప్రయాణం ఆటంకంగా మారుతుందని, ప్రభుత్వం వెంటనే ప్రత్యేక గ్రాంట్‌ ఇచ్చి బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరారు.
కోవూరు పట్టణానికి అతి తక్కువ సమయంలో చేరుకునే ప్రధాన రహదారి అంతే కాకుండా ముంబై రోడ్డులో నుంచి నేషనల్‌ హైవే లింక్‌ రోడ్డుగా ఉందని ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తే రైతులకు, చేనేత వస్త్ర వ్యాపారులు, రోజువారీ కూలీలకు, చిరు వ్యాపారులకు రోజు వందలాది వాహనాల్లో ప్రయాణం చేస్తారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన కలుజుపై బ్రిడ్జి నిర్మాణాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు గుర్తించి నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం గుర్తిచే వరకు పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాబు, సుబ్బారావు, సురేంద్ర, సురేష్‌, విజయకుమార్‌, కాలేషా, మల్లికార్జున రెడ్డి, హుమాయన్‌, హరి, అప్రోజ్‌, చాన్‌బాషా, బుజ్జియ్య, పెద్దబ్బయ్య, ఖాదర్‌బాషా, వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.