మాట్లాడుతున్న నాయకులు
బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలి
కొనసాగుతున్న దీక్షలు
కోవూరు: చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని గుమ్మళ్లదిబ్బ ప్రజలు కోరారు. శనివారం నాల్గవ రోజు దీక్షలు కొనసాగాయి. దశాబ్దాల కలను నెరవేర్చుకోవాల్సిన బాధ్యత గుమ్మళ్ల దిబ్బ పాటూరు ప్రజలపై ఉందని రైతు సంఘం నాయకులు గండవరపు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. కోవూరు చెరువుకలుజు ప్రమాదాలకు రహదారిగా ఉంది. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక నిధి ఇచ్చి బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరారు, కోవూరు నియోజకవర్గానికి చేరుకునే ప్రధాన రహదారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి నిధులు తెచ్చే ప్రయత్నం ప్రజాప్రతినిధులు చేయాలి. అంతే కాకుండా నేషనల్ హైవే లింక్ రోడ్డు దారుణంగా ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తే రైతులకు, వ్యాపారులకు, కూలీలు రోజు వందలాది వాహనాలు ప్రయాణం కలుజు పై బ్రిడ్జి ఉంటే రాకపోకలకు ఉపయోగకరంగా ఉంటుం దన్నారు.కలుజుపై బ్రిడ్జి నిర్మాణాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గండవరపు శేషయ్య, బుజ్జయ్య, పెద్దన్న, సోమాగోపాల్, గాదిరాజు సుధయ్య, ఎస్‌కె బాబు, తన్నీరు శివ, సురేంద్ర, సురేష్, కాలేషా, అప్రోజ్, చాంద్ బాషా, విజరు కుమార్, జానకిరామ్, కాలేష , సురేంద్ర, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.










