ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటుపడిన ప్రజలు ఎక్కువగా పిజ్జా, బర్గర్‌లను తింటుంటారు. బేకరీ రేటు ప్రకారం బర్గర్ విలువ రూ.50 నుంచి 200 వరకు ఉంటుంది. అయితే ఓ బర్గర్ ఉందండోరు.. దీనికి 'గోల్డెన్ బర్గర్' గా నామకరణం చేసి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. అంతే.. ఆహార ప్రియులంతా దీనివైపు లొట్టలేసుకుంటూ చూస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.. ఆ బర్గర్ రేటు అక్షరాలా... రూ. 4.42 లక్షలు !
పేరుకు తగ్గట్టుగానే ఈ బర్గర్‌ను బంగారు ఆకులతో అలంకరిస్తారు. ఈ బర్గర్‌ను నెదర్లాండ్‌లోని డే డాల్టన్ రెస్టారెంట్ తయారు చేసింది. ఈ గోల్డెన్ బర్గర్‌కు గోల్డెన్ బారుగా పేరు పెట్టారు. ఈ బర్గర్‌ను అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ట్రస్ట్ కు అందిస్తామని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఖరీదైన తయారీ వస్తువులు..
ఖరీదైన కెవిఎన్, పెద్ద సముద్రపు పీత, కుంకుమపువ్వు, వాగ్యూ బీఫ్, పందిమాంసం, అరుదైన తెల్లని పుట్టగొడుగులు, చీజ్, ఖరీదైన సీవెట్ కాఫీ గింజలతో తయారుచేసిన బార్బెక్యూ సాస్, డామ్ పెరెగ్నాన్ షాంపెన్‌తో తయారు చేసిన బన్‌ను ఉపయోగించి ఈ బర్గర్‌ను తయారు చేశారు.










