May 12,2023 22:25

ఫొటో : మాట్లాడుతున్న మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకటరామారావు

బొల్లినేని కలిసిన ఎంఎల్‌ఎ మేకపాటి
ప్రజాశక్తి-కలిగిరి : ఉదయగిరి అభివృద్ధి కోసమే సస్పెండ్‌ అయిన తర్వాత ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఎగా, మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఉదయగిరి ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉదయగిరి మెట్ట ప్రాంతమని అభివృద్ధి చందాలంటే అధికారంలోకి రాబోయే పార్టీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఉదయగిరిలో టూరిజం, రోడ్లు, సాగునీరు తదితర సమస్యల సాధనకు కృషి చేస్తానన్నారు. అనంతరం బొల్లినేని రామారావు తమ కార్యకర్తలను పరిచయం చేస్తూ వీరంతా మీ బాధితులేనని మేకపాటికి తెలుపుగా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు.
అనంతరం బొల్లినేని మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి జగన్మోహన్‌ రెడ్డికి చాలా తేడా ఉందని కక్షపూర్వకంగానే ఇన్‌ఛార్జిల పేరుతో శేఖర్‌రెడ్డిని ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు. గతంలో రాజకీయంగా సవాళ్లు ప్రతి సవాళ్లు ఇద్దరం చేసుకొనే విషయం వాస్తవమేనని అవి రాజకీయంగా ఉండాలే తప్ప కక్ష పూర్వితంగా ఉండకూడదన్నారు. జిల్లాలోముగ్గురు వైసిపి ఎంఎల్‌ఎలు జగన్‌ను నమ్మినందుకు నట్టేటా ముంచాడని బొల్లినేని విమర్శించాడు. జిల్లా అధిష్టానం ఆదేశాల మేరకే మేకపాటితో భేటీ అవ్వడం జరిగిందన్నారు. కేడర్‌ సహకరిస్తే 2024లో ఉదయగిరిలో పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. పార్టీ పరంగా అన్యాయం జరిగిన మేకపాటి కూడా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఒంటేరు జయచంద్రారెడ్డి, కార్యదర్శి కాకు మహేష్‌, నాయకులు సిహెచ్‌, తాతయ్య, ఎస్‌.కొండయ్య, వెంగపనాయుడు, పి.సుబ్బారావు, కర్నాటి.ప్రభాకర్‌, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.