రాయచోటి టౌన్ : బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వైసిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని 24వ వార్డు సచివాలయం, 33వ వార్డులో మాసాపేట గొల్లపల్లె, రాజీవ్ స్వగహలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటా శ్రీకాంత్ రెడ్డి పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలును వివరిస్తూ, సమస్యలపై ఆరా తీస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ది అందుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, కమిషనర్ గంగా ప్రసాద్, మున్సిపల్ ఆర్‌ఐ మల్లికార్జున, స్థానిక కౌన్సిలర్ జ్యోష్ణ, నేలపాటి వెంకటేష్, ఆంజనేయులు, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, ఆసీఫ్ అలీఖాన్, కొలిమి చాన్‌బాష, గౌస్ ఖాన్, జానం రవీంద్రా యాదవ్, అన్నా సలీం, కో ఆప్షన్ అయ్యవారు రెడ్డి, హజరత్ ఖాదర్ వలీ, జిఎం డి ఇమ్రాన్ ఇర్షాద్ పాల్గొన్నారు.










