May 31,2023 20:48

మాట్లాడుతున్న ఎపి ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రరెడ్డి

 మదనపల్లె అర్బన్‌ : బిటి కళాశాల యూనివర్సిటీ ఏర్పాటుపై ఒకటిన్నర నెలల్లో డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందిస్తామని ఆంధ్ర ప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మదనపల్లిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాషాలతో కలసి అయన బిటి కళాశాలలో పర్య టించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ బిటి కళాశాల ఘణ చరిత్రను దష్టిలో ఉంచు కొని, ఈ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే వివిధ సంఘాలు ఒత్తిడి చేసిన నేపథ్యంలో స్వతంత్ర ఉద్యమంలోనూ కళా శాల పోషించిన పాత్ర మిథున్‌రెడ్డి, నవాజ్‌ బాషాల విజ్ఞప్తి మేరకు కళా శాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బెంగాల్‌ నుంచి ఆంగ్లంలోకి మదనపల్లి బిటి కళాశాలలో జాతీయ గీతాన్ని తర్జుమా చేసి బాణీలు కట్టిన చరిత్ర సొంతం చేసుకున్నదని గుర్తు చేశారు. బిటి కళాశాల పూర్వ వైభవానికి తగినట్టుగా ప్రభుత్వం అభివద్ధి చేయటానికి కషి చేస్తుందని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ మదనపల్లి ఘన చరిత్రకు ల్యాండ్‌ మార్క్‌గా యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం, ఇందుకుగాను సుమారు రూ.130 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మదనపల్లెను సరస్వతి నిలయంగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. మదనపల్లె కేంద్ర విశ్వ విద్యాలయం రానున్నదని, త్వరలోనే మంజూరు చేస్తు ఆర్డర్‌ కాపీ