Jun 23,2023 21:53

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నిబోయిన చెంచుకుషోర్‌

బిసిల ద్రోహి సిఎం జగన్మోహన్‌ రెడ్డి
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : బిసిల ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నిబోయిన చెంచుకుషోర్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని టిడిపి కార్యాలయంలో బిసి నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి హయాంలో బిసిలకు పెద్దపీట వేస్తూ అనేక అవకాశాలు కల్పించారని, వైసిపి ప్రభుత్వంలో బిసిలకు తీవ్ర అన్యాయం వాటిలిందన్నారు.
బిసి సబ్‌ప్లాన్‌ నిధులను సంక్షేమాలకు తరలించి జగన్మోహన్‌ రెడ్డి బిసిలకు నమ్మక ద్రోహం చేశారన్నారు. ప్రశ్నిస్తే బిసిలపై కేసులు పెడతారని ప్రశ్నించారు. ఇకనైనా బిసిలు మేల్కొని రాబోయే ఎన్నికల్లో వైసిపికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర బిసిసెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గంపల అనిల్‌, మైనార్టీనేత ఎస్‌కె ఇంతియాజ్‌, గుండాల సుధీర్‌, మధుబాబు, తదితరులు పాల్గొన్నారు.