Jan 09,2023 21:30

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంపిపి రమణారెడ్డి

         ప్రజాశక్తి-నల్లచెరువు   మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాని ఎంపిపి రమణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వసతి గృహంలో పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి నారాయణస్వామి, వార్డెన్‌ లక్ష్మీనారాయణ, గోవింద్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.