బిందెలు పంపిణీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-వలేటివారిపాలెం :పాల వినియోగదారులకు మెరుగైన ధరలు చెల్లిస్తూ సంగం డెయిరీ ముందు వరుసలో నిలుస్తుందని ఏజెంట్ కొల్లూరి మహేంద్ర తెలిపారు. మండలంలోని నేకునాంపురం, నూకవరం గ్రామాల్లో సరగం డెయిరీ తరఫున పాలు ఆయన సేకరిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తమ వద్ద పాలు పోస్తున్న వినియోగదారులకు ఆదివారం బిందెలు పంపిణీ చేశారు. వినియోగదారులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. నడిపినేని వెంకమ్మ, దాచర్ల రాజ్యం, మల్లెబోయిన కొండయ్య, గుర్రం ఆదిలక్ష్మమ్మ, డెయిరీ సూపర్‌వైజర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.










