మాట్లాడుతున్న ఎంపి వేమిరెడ్డి
బిల్డర్స్ నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాలి
నెల్లూరు :బిల్డర్స్ అందరు నిబంధనలకు లోబడి నాణ్యమైన నిర్మాణములను ప్రజలకు అందించాలని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం క్రెడారు నెల్లూరు చాప్టర్ వారిచే స్థానిక కస్తూరిదేవి గార్డెన్స్ నందు నిర్వహించుచున్న హౌమ్ ఎక్సపో ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ఫోలో ప్రదర్శించబడుతున్న ప్రతి స్టాల్‌ను ఆయన సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వారు ప్రతి ఒక్కరు లే అవుట్స్ ను ఖచ్చితముగా అప్రూవల్ చేయించుకోవలసినదిగా సూచించారు. ఈ కార్యక్రమంలో క్రెడారు నెల్లూరు చాప్టర్ ప్రెసిడెంట్ డి. రామకష్ణ, గ్రీవెన్స్ చైర్మన్ డి. రాజశేఖర్ నాయుడు, సెక్రటరీ టి. మధుసూదన్, ఉపాధ్యక్షులు యమ్. రామమూర్తి రెడ్డి, టి. నరేంద్రరెడ్డి, జాయింట్ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.










