Apr 22,2023 20:21

లెనిన్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

మదనపల్లె అర్బన్‌ : రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాని సాగనంపుదామని సిపిఎం, సిపిఐ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, మురళి పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక శ్రామిక వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిని రాజకీయ ప్రచార భేరి శనివారం తొమ్మిదో రోజు సాగింది. ఈ సందర్భంగా స్థానిక వారపు సంతలో కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. విఐ లెనిన్‌ 153వ జయంతిని సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్క్సిస్టు మేధావి రష్యా విప్లవ యోధుడు కార్మిక వర్గ స్థాపనను సుసాధ్యం చేసిన కమ్యునిస్టు యోధుడు లెనిన్‌ అని పేర్కొన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్‌ విధానాలను అవలంబిస్తుందన్నారు. దేశ సంపదను కార్పొరేట్‌ ముసుగులో తమ అనుచరుల చేతికి అప్పగిస్తున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌ చేతున్నారని, అందుకు జగన్‌ కూడా అంతర్గతంగా అనుకులమేనన్నారు. మదనపల్లి వారపు సంతలో చిరు వ్యాపారస్తుల వద్ద గేటు వసువులు చేసే కాంట్రాక్టర్‌ వందల రూపాయలు గేటు నిర్బంధంగా వసువులు చేస్తున్నారని పేర్కొన్నారు. వారపు సంతలో మునిసిపల్‌ నిబంధనలకు విరుద్ధంగా పర్మినెంట్‌ సెడ్లును నిర్మించారని, అక్రమ నిర్మాణాలను నిర్మిస్తున్న వారికి అధికారులు పాలకులు పూర్తిగా అండగా ఉన్నారని పేర్కొన్నారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 వ తేదీన మదనపల్లి పట్టణంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొనాలని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దేవా, తిరుమల, రవి, నవీన్‌, శోభ, రమణ, అశోక్‌, కెకె వెంకటేష్‌ పాల్గొన్నారు.