బిజెపిని ఓడిద్దాం.. దేశాన్ని కాపాడుకుందాం..
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్భన్ : ప్రధాని మోడీని గద్దె దింపి దేశాన్ని కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని కనుకూరుపల్లి గ్రామంలో ప్రచారభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంటా లక్ష్మీపతి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడం అత్యంత దారుణమన్నారు. ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై పారాల మోపడం తగదని విమర్శించారు. రాజ్యాంగానికి మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం లౌకికతత్వం సామాజిక న్యాయం లాంటి గొప్ప విలువలను కలరాస్తున్నారని విమర్శించారు. బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పెంచలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.










