Mar 25,2023 22:27

పోస్టర్లు విడుదల చేస్తున్న సిఐటియు నాయకులు

         పుట్టపర్తి రూరల్‌ : కార్మి, కర్షక విధానాలను అవలంభిస్తూ ఆ వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఈ నెల 5న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎవి.నాగేశ్వరరావు, ఆర్‌వి.నరసింహారావులు తెలిపారు. శనివారం నాడు పుట్టపర్తిలోని సిఐటియు కార్యాలయంలో ఛలో విజయవాడ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక, కర్షక హక్కులను కాలరాసేలా మోడీ ప్రభుత్వం చట్టాలను మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు, పెన్షన్‌ రూ.10 వేలు ఇవ్వాలన్నారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను తక్షణం రద్దు చేయాలన్నారు. కేరళ తరహా రైతు రుణమాఫీ చేయాలన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లు 2022ను రద్దు చేయాలని కోరారు.ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో రెండు లక్షల కోట్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమ్యన్నింటి పరిష్కారంపై కేంద్రాన్ని నిలదీసేలా ఏప్రిల్‌ 5న చేపట్టిన చలో ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఇంతియాజ్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌, జెడ్పీ.శ్రీనివాస్‌, శ్రామిక మహిళ నాయకురాలు దిల్షాద్‌ జిల్‌.నరసింహులు, లక్ష్మినారాయణ, సాంబశివ, రామకష్ణ, పైపల్లి గంగాధర్‌, పెడబల్లి బాబా పాల్గొన్నారు.