రాయచోటి టౌన్ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషన్‌ను వెంటనే అరెస్టు చేయాలని, తమకు న్యాయం చేయాలని దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న వారిపై మోడీ ప్రభుత్వం తీరు దేశానికి అగౌరవమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు అన్నారు. గురువారం ప్రజా సంఘాలు జాతీయ కమిటీల పిలుపు మేరకు ప్రభుత్వ బాలుర కళాశాల వద్ద ఆట స్థలంలో వాలీబాల్, కబడ్డీ క్రీడాకారులతో కలసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేలాగా రెజ్లర్ల మహిళా క్రీడాకారులు బంగారు కాంక్ష పథకాలను ఒలంపిక్ టిక్కో ఒలంపిక్‌లో సాధిస్తుంటే వారికి అండగా నిలవాల్సిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కంచె చేను మేసినట్లు కాపాడాల్సిన అధ్యక్షుడే వారే లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే వారి సమస్యలను ఎవరు పరిష్కరించాలని ప్రశ్నించారు. క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపైన చర్య తీసుకోవాలని జనవరిలో ఆందోళనకు దిగితే ప్రభుత్వం కమిటీ వేసి విచారిస్తామని హామీ ఇచ్చి నాలుగు నెలలైనా పట్టించుకోకపోవడంతో కొద్ది రోజుల కిందట ఏడు మంది మహిళా రెజ్లర్ల క్రీడాకారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. కోర్టు సైతం ఇది తీవ్రమైన ఆరోపణ తక్షణమే ఢిల్లీ పోలీసులు స్పందించి చర్య తీసుకోవాలని ఆక్షేపించిందన్నారు. బిజెపి ఎంపీని కాపాడడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా లైంగిక వేధింపులకు గురైన క్రీడాకారుణులపైన వారి కుటుంబ సభ్యులపైన దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడడం ఆర్థికంగా సహకరిస్తామని ఆశ పెట్టడం జరుగుతుందని విమర్శించారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎస్.ఫయాజ్ మాట్లాడుతూ 25 రోజులుగా రాత్రి పగలు ఎండ వాన అనకుండా రెజ్లర్ల క్రీడాకారులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తుంటే దేశవ్యాప్తంగా మేధావులు ప్రజాసంఘాలు ముఖ్యంగా మహిళ రైతు సంఘాలు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ మాలిక్ లాంటి మేధావులు మద్దతుగా నిలుస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా అవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఎంపీలు, మంత్రులు దేశంలో రోజుకొకరు లైంగిక వేధింపులకు అత్యాచారాలకు హత్యలకు పాల్పడుతున్నా బాధితులపైన దాడులు చేసి చంపుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. లైంగిక వేధింపులకు అత్యాచారాలకు హత్యలకు దౌర్జన్యాలకు దాడులకు ప్రతీకగా బిజెపి నిలుస్తుందని విమర్శించారు. ఆందోళన చేస్తున్న రేజ్లర్లపై పాశవికంగా దాడులకు పాల్పడటం దారుణమన్నారు. తక్షణమే మోడీ ప్రభుత్వం రెజ్లర్ల ఆందోళనకు స్పందించి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరన్ సింగ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి డిమాండ్ చేశారు. తక్షణమే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్నారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన ఉదతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నరేష్, వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.










