Apr 25,2023 21:26

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలు ప్రమాదకరం


సిపిఎం-సిపిఐ రాజకీయ ప్రచార భేరి సభలో నాయకులు
మదనపల్లె అర్బన్‌ : బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలు దేశ సమైక్యతకే ప్రమాదమని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, రామానాయుడు అన్నారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక శ్రామిక వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిని రాజకీయ ప్రచార భేరిలో భాగంగా మంగళవారం స్థానిక చిత్తూరు బస్టాండ్‌ వద్ద సిపిఎం, సిపిఐ పట్టణ కార్యదర్శిలు ప్రభాకర్‌రెడ్డి, మురళి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించకపోతే దేశ సమగ్రతకు ఐఖ్యతకు ప్రమాదమని, దేశాన్ని కార్పొరేట్లకు పూర్తిగా అమ్మేస్తాడని పేర్కొన్నారు. మోడీకి మత పిచ్చి ముదిరిందని మతాల మధ్య చిచ్చు పెట్టి మంటలు కాస్తుందన్నారు. నవరత్నాలుగా చెప్పుకొంటున్న ప్రభుత్వ రంగ సంస్థలను, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేందుకు కార్పొరేట్‌ ప్రయోజనాలకోసం నల్ల చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, కమ్యునిస్టు పార్టీ ఏడాది పాటు పోరాటం చేసి నల్ల చట్టాలను రద్దు చేసుకున్నామన్నారు. కమ్యూనిస్టులు ఈ దేశాన్ని మోడీ ఫాసిస్టు విధానాలను కాపాడు కొంటుందన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకంను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. కమ్యూనిస్టులు నాయకుల పదవులు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను నేడు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. బిజెపి అధికారంలోకి రాక ముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.50 లోపు ఉంటే ఈ రోజు రూ.వంద దాటిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు రాయలసీమకు ప్యాకేజీకి బిజెపి ఇవ్వకున్నా వైసిపి, టిడిపి అడిగే పరిస్థితి లేదన్నారు. జగన్‌ నవరత్నాల పేరుతో అప్పులు చేసి డబ్బులు పంచుతున్నారు. ఎస్సీి, ఎస్టీ నిధులను నవరత్నాలకు మల్లిస్తున్నారనారు. మదనపల్లి ప్రాంతంలో టమోటా రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జగన్‌ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హక్కులను హరిస్తున్నారాని, దళితులపైన, దళిత ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇండ్లను ఎందుకు పంపిణీ చేయలేదన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శిలు పి.శ్రీనివాసులు, నరసింహులు, నాయకులు హరేంద్రనాథ్‌ శర్మ, వెంకటేష్‌, చంద్ర, మహేష్‌, కృష్ణప్ప, సాంబ శివ, తిరుమల, దేవా, ఓబులేసు పాల్గొన్నారు.
- మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేశ్వర్లు