Apr 22,2023 20:02

మాట్లాడుతున్న బ్యాంక్‌ అధికారులు

ప్రజాశక్తి -పొదలకూరు :కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలైన పి.ఎం.జీవన్‌ జ్యోతి బీమా యోజన, పి.ఎం.సురక్ష బీమా యోజన వంటి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కెనరా బ్యాంక్‌ జిఎం ఎం.భాస్కర చక్రవర్తి తెలిపారు. శనివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పొదలకూరు కెనరా బ్యాంక్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో వారు పాల్గొన్నారు. కెనరా బ్యాంక్‌ జీ.ఎం భాస్కర చక్రవర్తి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ప్రదీప్‌ కుమార్‌ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారంతా ఈ బీమా పథకాలకు అర్హులేనని, జిల్లాలో ఉన్న హై రిస్క్‌ ప్రజలంతా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అన్నారు. పొదలకూరు కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ నాగనాథ్‌, నెల్లూరు రీజనల్‌ ఆఫీస్‌ సిబ్బంది, పొదలకూరు బ్యాంక్‌ శాఖ సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.