పాట్నా : బీహార్‌లోని చంపారన్‌లో నకిలీ మద్యం సేవించి గత కొన్ని రోజుల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన చంపారన్ జిల్లాలోని లాలూరియా బ్లాక్‌లోని పలు గ్రామాల్లో చోటుచేసుకుంది. బుధవారం నుండి శుక్రవారం వరకు 16 మంది మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ద్యురావా నలుగురు, భగిలో ఒకరు జోగియాలో ముగ్గురు మరణించారు. ఇదే ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం మరో ఎనిమిది మంది మరణించారని చెప్పారు. వీరంతా మద్యం సేవించి చనిపోయారని అధికారులు చెబుతుండగా.. కాగా, నలుగురు బాధితులు మాత్రం లిక్కర్ కారణం కాదని చెబుతున్నారు.










