Jan 14,2023 21:39

ఫొటో : టిడిపి నేత బీద రవిచంద్రను సన్మానిస్తున్న టిడిపి నాయకులు

బీద రవిచంద్రను కలిసిన టిడిపి నేతలు
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలోని ఇస్కపల్లి గ్రామానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విచ్చేయగా శనివారం పలు గ్రామాలకు చెందిన టిడిపి నాయకులు ఆయనను కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి బీద సోదరులను ఘనంగా సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు.
భోగి పండుగ సందర్భంగా గ్రామానికి రాగా సమాచారం తెలుసుకున్న కార్యకర్తలు విచ్చేసి పలు విషయాలను ఆయనతో నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు అయ్యేంతవరకు ఇక్కడే ఉంటానని పార్టీ శ్రేణులకు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.