Jan 11,2023 21:07

ఫొటో : జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న బీద రవిచంద్ర

బీద రవిచంద్ర జన్మదిన వేడుకలు
ప్రజాశక్తి-అల్లూరు : స్థానిక నూకలపాటి వారి కళ్యాణమండపంలో బుధవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర 53వ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పలువురు కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. భారీ కేక్‌కట్‌ చేసి అభిమానులకు పంచి పెట్టి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ నమ్ముకున్న కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించే గొప్ప మానవతా మూర్తి అని కొనియాడారు.
అధికారం ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలతో మమేకమై వారికి అండగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బీదగిరిధర్‌, బండి శ్రీనివాసులు రెడ్డి, బుల్లా కృష్ణారెడ్డి,అరగల రమణయ్య, అంబటి రాజేంద్ర చెంతాటి రాజశేఖర్‌ బాబు, కావలి జగన్మోహన్‌ రావు తదితరులున్నారు.