Apr 21,2023 22:01

ఫొటో : ప్రశంసా పత్రాలు అందుకున్న చిన్నారులు

'బిఆర్‌ఆర్‌' పాఠశాలలో కిడ్స్‌ డే
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మండలంలోని కుడితిపాలెం గ్రామంలోని బి.ఆర్‌.ఆర్‌. ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌లో శుక్రవారం కిడ్స్‌ డే, గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లలిత మహేశ్వర ఆశ్రమ పీఠాధిపతి రామాయణం మహేశ్వర స్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో బహుమతులు పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు ఉపాధ్యాయులను తల్లిదండ్రులను అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామంలో ఉన్న ఈ పాఠశాలను అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దరమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
తమను నమ్మి విద్యార్థులను తమ పాఠశాలకు పంపిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రంగాలపై అవగాహన కల్పించి ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలకు వెళ్లే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హరిబాబు, వైఆర్‌ఆర్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ వై వి సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.