బహుమతులు అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి - లింగసముద్రం :సంక్రాంతి సందర్భంగా గంగపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీల్లో గెలుపోందిన వారికి గ్రామ సర్పంచ్ పేలపల్లి మహేష్‌బాబు బహుమతులను అందజేశారు. క్రికెట్ పోటీల్లో గంగపాలెంలోని అంబేద్కర్ యూత్ టీమ్ మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. ఆ టీమ్‌కు రూ. 5 వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేష్‌బాబు మాట్లాడుతూ గ్రామంలో పండుగ సందర్భంగా పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యువకులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం సంతోషానిచ్చిందన్నారు.










