Feb 02,2023 18:30

బహుమతి అందుకుంటున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు :జాతీయ ఓటర్స్‌ దినోత్సవం పురష్కరించుకొని గత నెల 21వ తేదీన కందుకూరు పట్టణం బాలికల పాఠశాలలో నిర్వహించబడిన వ్యాసరచన, డిబెట్‌ అంశం పటిష్టమైన ఎన్నికల నిర్వహణకు సంస్కరణలు- యువ ఓటరుగా సలహాలు సూచనలు అనే అంశంపై డిగ్రీ విభాగంలో పోటీలు నిర్వహించారు. శ్రీవివేక డిగ్రీ కళాశాలకు చేందిన విద్యార్థి సయ్యద్‌ సఫిముని పాల్గొని డిబెట్‌లో నియోజకవర్గ స్థాయిలో ప్రథమ బహుమతి, వ్యాసరచనలో ద్వితీయ బహుమతి సాదించారు. దానిని గురువారం 3వ జాతీయ ఓటర్స్‌ డే సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అందజేశారు.కళాశాలలో సయ్యద్‌ సఫిమునిని బిఆర్‌ ఆక్స్‌ఫర్డ్‌ విద్యా సంస్థల చైర్మన్‌ ఉన్నం భాస్కరరావు, కరస్పాండెంట్‌ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్‌ బెజవాడ నరేంద్రబాబు, బాలభాస్కరావు, ప్రిన్సిపాల్‌ అబ్బూరి వెంకటేశ్వర్లు అభినందించారు.